సమస్యలు పై స్పందించిన కమిషనర్

అమరావతి, జులై  : కోవిద్ 19 సందర్భంగా ప్రజా రవాణా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు పై రవాణా ప్రిన్సిపాల్ కార్యదర్శి మరియు ప్రజా రవాణా శాఖ కమిషనర్ టి.కృష్ణబాబు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు బుధవారం నాడు వైస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నేతలు అయిన ను కలిసి వినతి పత్రం సమర్పించారని ఫెడరేషన్ నేతలు తెలిపారు. ఎస్.ఆర్.బి.ఎస్, ఎస్.బి.టి రికవరీ ఆగిపోయిన నేపద్యంలో జరిగిన రికవరీ సొమ్మును ఉద్యోగులకు ఇప్పించాలని కోరారు. అలాగే రావలసిన 2013, 2014 లీవ్ ఎన్ క్యాష్మెంట్, ఇటీవల కండక్టర్ తో వాటర్   అమ్మిస్తున్నారని ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి చెప్పారు. కోవిద్ 19 కేసులు పెరుగుతున్న కారణంగా అంబులెన్స్ కు డ్రైవర్లు గా పనిచేస్తున్న సిబ్బందికి రక్షణ కిట్టులు అందించాలని, అలాగే విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి కారోనా సోకి చికిత్స పొందితే వారికి స్పెషల్ సి.ఎల్. ఇప్పించాలని, దురదృష్టవశాత్తు మరణించిన వారికి కోవిద్ 19 బీమా సదుపాయాలు కల్పించాలని నేతలు కోరారు. కృష్ణబాబు గారిని కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్
దేవరాజులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు వి.జయరావు, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాసరావు,  కోశాధికారి డి.పూర్ణ చంద్రర్ రావు, ప్రధాన కార్యాలయం సభ్యులు జన్ పాల్, జి.వి.రావు, కాశిరత్నం తదితరులు పాల్గొన్నారు.